పలమనేరు: పట్టణ పోలీస్ స్టేషన్ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. పలమనేరు మున్సిపల్ పరిధి గంటావూరుకు చెందిన రాజమ్మ రాత్రి ఇంట్లో అందరితో పాటు కలిసి నిద్రించింది. అర్ధరాత్రి లేచి ఎటో వెళ్లిపోయింది, అప్పటినుండి చుట్టుపక్కల ప్రాంతాలు మరియు బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో పలమనేరు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు, పై ఫోటోలో ఉన్న మహిళ ఎవరికైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు.