గోపాలపట్నం:సోమవారం కురిసిన భారీ వర్షానికి గోపాలపట్నం దరి జనతా కాలనీ వీధులు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి, బంటా కాలనీ ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వర్షపు నీరు దిగువ ప్రాంతాల్లో ఉన్న నందమూరి నగర్ కు జనతా కాలనీ కు సరిహద్దులో ఉన్న గెడ్డ క్రమేపి ఆక్రమణలకు గురై సుమారు 30 అడుగుల వెడల్పు గల గెడ్డ నేడు 2 అడుగులు కూడా లేకుండా రోజువారి వాడుకునేరు కూడా వెళ్లలేనంతగా ఆక్రమించేశారు. తద్వారా వాడుక నీరే వెళ్లలేనప్పుడు భారీ వర్షాలు వలన వచ్చే వర్షపు నీరు బంటా కాలనీ కొండపై నుంచి వచ్చే వర్షపు నీరు వెళ్లడానికి వీలు లేకపోవడంతో జనతా కాలనీ వీధులలో ప్రవహించి చెరువులను నదులను తలపిస్తు జలమయం అయ్యాయ.