పాల్వంచ సహకార సంఘం సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి క్యూలో నిలబడ్డప్పటికీ వారికి యూరియా లభించడం లేదు. ఈ నేపథ్యంలో,సొసైటీలో విధులు నిర్వహించే ఒక వ్యక్తి సహకారంతో అక్రమ మార్గంలో ఒక ఆటోలో 10 బస్తాల యూరియాను తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు.రైతులు ఆ యూరియా బస్తాలను బుధవారం జాతీయ రహదారిపై లాక్కెళ్లి ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పాల్వంచ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆటోను పోలీస్ స్టేషన్‌కు తరలించి, యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.