ఓరుగల్లు ప్రజల ఇలవేలపైన భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రత్యేక పూజలు నిర్వహించి మూసివేశారు ఆలయ అర్చకులు. ఈరోజు ఆదివారం రాత్రి 9 గంటల 50 నిమిషాల ప్రాంతంలో చంద్రగ్రహణం రానున్నదని అనంతరం సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట తర్వాత చంద్రగ్రహణం వీడుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మళ్లీ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ నిర్వహించి శుద్ధి చేసిన తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తుల సందర్శనార్థం ఉదయం 7 గంటల తర్వాత అనుమతించనున్నట్లు అర్చకులు తెలిపారు.