జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగ బాబు క్యాంప్,కొత్తగూడెంలో ఉన్న భవిత సెంటర్ లో మూగ,చెవిటి పిల్లలకు గురువారం ప్రత్యేక వైద్య శిబిరంను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగ పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతు వైకల్యం అనేది ఒక ఘటన మాత్రమే కానీ సమస్య కాదు అనే విషయం పట్ల సమాజాన్ని చైతన్య పరచవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.