షాద్ నగర్ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేసినా వ్యక్తిగత విమర్శలు ఎవరిపై చేయలేదని, కానీ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాత్రం వ్యక్తిగతంగా విమర్శిస్తూ అనేక ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. పార్టీ క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గుంట భూమి కూడా తాను సంపాదించలేదని మాజీ ఎమ్మెల్యే అన్నారు. ఏ విచారణకైనా సిద్ధమేనని పేర్కొన్నారు.