ఎన్నికల ముందు తాను కబ్జాలకు పాల్పడ్డానని కూటమి నాయకులు అసత్య ప్రచారాలు చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం ఆరు నెలలు అవుతున్న తాను ఎక్కడ కబ్జా చేశానో చూపించలేకపోతున్నారని తాను ఎక్కడ కబ్జా చేసానో చూపించాలని నంద్యాల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నంద్యాల పార్లమెంట్ పరిధిలోని కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామంలో మాజీ సీఎం వైయస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రావెల్ కు కూడా డబ్బులు వసూలు చేసే చరిత్ర ఎవరిదో తెలుసని కూటమి నాయకులను విమర్శించారు.