రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేటకు చెందిన మల్లవ్వ అనే వృద్ధురాలు చెరువులో పడి మృతి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈనెల 9న సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి రాత్రి 8 అయిన ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికిన ఆమె ఆచూకీ దొరకలేదు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో నమాజ్ చెరువులో చనిపోయి తేలుతూ కనిపించింద అని మృతురాలి కొడుకు సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.