యాంకర్ : రాష్ట్రంలో యూరియా మరియు డిఏపిలను రైతులకు సకాలంలో అందించాలని, ఎరువుల బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని కోరుతూ సిపిఐ మరియు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లో వద్ద ధర్నా చేపట్టారు. అందులో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద జిల్లా సిపిఐ మరియు రైతు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సమృద్ధిగా యూరియా అందించామని చెబుతున్నప్పటికీ సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉందని అర్థమవుతుందన్నారు.