గత రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి కుంటాల జలపాతం వరద నీటితో పొంగిపొర్లుతుంది.అదేవిధంగా బోత్ మండలంలోని పొచ్చర జలపాతం విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఈ జలపాతం ఆదివారం ఉగ్రరూపం దాల్చింది. పాల నురుగు లాంటి జలధారలు కనువిందు చేస్తున్నాయి.అయితే కుంటాల,పొచ్చర జలపాతాలు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో ఆదివారం ,సోమవారం, మంగళవారం మూడు రోజులపాటు ఈ జలపాతాల వద్ద అటవీశాఖ అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. వర్షాలు తగ్గేవరకు జలపాతాల వద్దకు పర్యాటకులను అనుమతించబోమని పర్యాటకులు జలపాతం సందర్శనకు రావద్దని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.