వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని అయినవోలు మండలం కొండపర్తి గ్రామంలో యూరియా ఇవ్వకుండా నానో యూరియా ఇస్తున్నారు అంటూ గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం లైన్లో నిలబడిన రైతులు యూరియా ఇవ్వకుండా నానో యూరియా అంటగట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు నానో యూరియా డబ్బాలను పగలగొట్టారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు రైతులు దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.