నిత్యా వసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూరియా సరఫరా, ఉల్లి కొనుగోలు సంబంధిత అంశాలపై సి ఎస్ కే విజయా నంద్ తో కలిసి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు..ఈ వీడియో కాన్ఫరెన్స్ కు వైఎస్ఆర్ కడప జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.