నంద్యాల జిల్లా అత్మకూరు సబ్ డివిజన్ పరిదిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి మండలాలలో తెల్లవారుజామ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుందడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొన్నిలోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నరు. ఇప్పుడు పడుతున్న ఈ భారీ వర్షం దాటికి కోతకు వచ్చిన మొక్కజొన్న పంట తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు మనోవేదనకు గురవుతున్నారు.