కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ అశోక్ మండపాల నిర్వాహకులకు సూచించారు. ఆదివారం, బాన్సువాడ పట్టణంలోని మినీ ట్యాంక్ వద్ద నిమజ్జన స్థలాన్ని కమిషనర్ బి. శ్రీహరి రాజు, టౌన్ సీఐ ఎం. అశోక్ సందర్శించారు. నిమజ్జన ప్రక్రియ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు.నిమజ్జనం సందర్భంగా పకడ్బందీగా బందోబస్తు నిర్వహణ చర్యలు ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. మండపాల నిర్వహకులతో సమావేశం నిర్వహించి అన్ని నిబంధనలు తెలిపామని పేర్కొన్నారు.