తాడిమర్రి మండలంలోని బీసీ కాలనీలో శనివారం పంచాయతీ కులాయిలో మంచినీరు బదులుగా కలుషితమైన నీరు వస్తున్నాడంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. పండగ పూట మంచినీరు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అధికారుల స్పందించి మంచినీరు వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.