ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేటలో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. రాజంపేట కాలనీకి చెందిన సురేశ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. శనివారం రాత్రీ తాళం పగల గొట్టి సుమారు రూ. లక్ష, నగదు,30 తులాల బంగారు ఆభరణాలను చోరీకి గురైనట్లు బాదితులు తెలిపారు. ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బాధితులు ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.