నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ ప్రాంతంలో గల సాయి టవర్స్ అపార్ట్ మెంట్ లో ఇల్లు దగ్ధం అయింది. అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ప్రమోద్ తన కుమారుడి చదువు నిమిత్తం హైదరాబాద్ వెళ్ళారు. శనివారం మధ్యాహం సాయి టవర్స్ D బ్లాక్ 402 లో ఫ్రిడ్జ్ ఆన్ ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్ తో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు ఫైట్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు ఇప్పుడు సమాజంలో 2 లక్షల వరకు ఆస్తి నచ్చటం జరిగినట్లు ఫైర్ సిబ్బంది అంచనా వేశారు..