మహిళల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి, మహిళలను గౌరవించిన చోటే దేవతలు సంచరిస్తారు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతమైనందుకు పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలో సూర్య తేజ ఫంక్షన్ హాల్ లో పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో జరిగిన మహిళల విస్తృతస్థాయి సమావేశం సోమవారం సాయంత్రం సుమారు 5 గంటలకు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.