ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో టిడిపి శ్రేణులు త్రీ మెన్ కమిటీ ఎదుట సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షున్ని ఎన్నుకునే క్రమంలో టిడిపి శ్రేణుల అభిప్రాయ సేకరణ కోసం రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి తో పాటు పార్టీ సీనియర్ నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కనపర్తి శ్రీనివాసుల ఆధ్వర్యంలో త్రీ మెన్ కమిటీని టిడిపి అధిష్టానం నియమించింది త్రీమేన్ కమిటీ ఎదుట ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇన్చార్జిలతో పాటుగా పదవులు నిర్వహిస్తున్న అనేకమంది ముఖ్య కార్యకర్తలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మరియు ముఖ్య టిడిపి శ్రేణులు సమావేశమయ్యారు ఈ సమావేశంలో త్రీ మన్ కమిటీ టిడిపి శ్రేణులు అభిప్రాయ సేకరణ చేసింది