యువత చదువులో ఫెయిల్ అయితే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడడం చాలా బాధను కలిగిస్తుందన్నారు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 8:30 గంటలకు వీడియోస్ సందేశాన్ని విడుదల చేశారు ఎంపీ కడియం కావ్య. 2003 వ సంవత్సరం నుండి who మరియు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ సంయుక్తంగా సూసైడ్స్ నివారణపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. మన చుట్టూ 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు ఎక్కువగా మొదట యాక్సిడెంట్ ఆ తర్వాత ఆత్మహత్యలతోనే చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ ఇండియా దేశంలోనే ఆత్మహత్యల కేంద్రంగా మారిందని ఆమె తెలిపారు