నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయ భవనం 16 ఏళ్ల తర్వాత శిథిలావస్థకు చేరుకుంది. రికార్డు రూమ్, అధికారులు, కంప్యూటర్ గదుల పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. స్లాబ్లోని ఇనుప రాడ్లు తుప్పుపట్టి ప్రమాదకరంగా మారాయి. దీంతో సిబ్బంది, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.