నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం లోని ఇందల్వాయి టోల్ ప్లాజా కంటైనర్ లారీ దగ్ధమైoది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న సర్ఫ్ ఎక్స్ప్రెస్ కంటైనర్ లారీ ఇందల్వాయి టోల్ ప్లాజా దాటుతుండగా ఒకసారి షార్ట్ సర్క్యూర్ తో మంటలు చెలరేగాయి. భారీ మొత్తంలో మంటలు ఎగసిపడి లారీ మందు భాగం దగ్ధమైంది. క్యాబిన్ లో ఉన్న క్లీనర్, డ్రైవర్ లారీ లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఇందల్వాయి ఎస్ఐ సందీప్ చేరుకొని, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.