పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు రైల్వే ట్రాక్ పై బాపట్ల వైపు గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా, అనే విషయం తెలియ రాలేదు. సమాచారం అందుకున్న బాపట్ల రైల్వే ఎస్ఐ సరస్వతి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వివరాలు ఇంకా తెలియలేదని ఎస్ఐ తెలిపారు