కావలి పట్టణంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులు ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి హాజరయ్యారు. పట్టణంలోని జెండా చెట్టు నుంచి సెల్ఫీ పాయింట్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం నేతలు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.