కాజీపేట దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. సయ్యద్ అఫ్జల్ బియభాని దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు దర్శించుకున్నారు. దర్గాలో పలువురు ముస్లిం పెద్దలతో కలిసి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, కాజీపేట తహసిల్దార్ భావు సింగ్, పలువురు ముస్లిం పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.