కారు ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్లు సోమవారం రాత్రి చోటుచేసుకుంది... స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం నుండి భద్రాచలం వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి కార్పొరేషన్ పరిధిలోని నవభారత్ సెంటర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.. ప్రమాదంలో కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం మేషన్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు మైలవరం వద్ద మెషన్ పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు ఢీకొంది.. ప్రమాదంలో వెంకటేశ్వర్లకు గాయాల కావటంతో స్థానికులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...