పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని కోరుతూ ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని విద్యార్థులు మంగళవారం ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు ప్రభుత్వ ఐటీఐ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.