సూర్యాపేటలో 43 వార్డులో పైపులైను పగిలి నీరు వృథాగా పోతుంది. సిద్ధార్థ స్కూల్ సమీపంలో అండర్ డ్రైనేజీ కోసం పైపులను తవ్వుతుండగా పైపులు ధ్వంసమైనట్లు స్థానికుడు మీరా అక్బర్ తెలిపారు. దీంతో ప్రధాన రహదారిపై నీరు ఏరులై పారుతోందనీ, వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు......