కడప నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద బీజేపీ కార్యకర్తలు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. PM నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు భారత మహిళలను అగౌరపరిచినట్లే అని అభిప్రాయపడ్డారు. ప్రధాని తల్లికి గౌరవం ఇవ్వలేని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.