మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించి సోమవారం మధ్యాహ్నం 12:00 లకు రాస్తారోకో చేస్తున్నారు.ఈ క్రమంలో అంబులెన్స్ రాగా రైతులు లేచి దానికి దారి ఇచ్చారు.అంబులెన్స్ మెల్లగా వెళుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అంబులెన్స్ పై చూసిన రైతులు చేతిలో ఉన్న గొడుగు తో రేవంత్ రెడ్డి చిత్రంపై ఆవేశంతో గుచ్చడం జరిగింది.ఈ క్రమంలో రైతులు కేరింతలతో తమ ఆవేశాన్ని వ్యక్తం చేశారు. ఫొటో చూస్తేనే ఇలా ఆవేశాన్ని వెల్ల కక్కిన రైతన్న ఇక నిజంగా సీఎం రేవంత్ రెడ్డి నీ చూస్తే తమ ఆవేశాన్ని ఎలా వ్యక్తం చేస్తారో మరి అని అక్కడున్న రైతులు అధికారులు చర్చస్తున్నారు