మహబూబాబాద్ పట్టణంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా లోని 5 గురు వ్యక్తులను అరెస్టు చేశామని మరో ఇద్దరు వ్యక్తులు పరారీ లో ఉన్నారని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ శుక్రవారం సాయంత్రం 5:00 లకు తెలిపారు.వీరి వద్దనుండి నాలుగు లక్షల రూపాయల విలువచేసే 2688 నకిలీ మద్యం క్వార్టర్ సీసాలు,2 కార్లు,4500 కాళీ సీసాలు,1755 టేబుల్స్,2000 మూతలు, 60 లీటర్ల స్పిరిట్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నకిలీ మద్యం తయారీ ముఠాను పట్టుకున్న సిబ్బందికి ఎస్పీ అభినందించి వార్డులను అందించారు.