ట్రెండ్ ఫాలో అవుతున్న భార్య, వివాహేతర సంబంధం పెట్టుకొని, తనను,చంపేయాలని చూస్తుందని భర్తఆవేదన *వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భార్య తననే హతమార్చాలని చూస్తోందని, తనకు ప్రాణహాని ఉందంటూ ఒక వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం గ్రామ శివారు జగ్గు తండాకు చెందిన బానోతు మహేశ్ మాట్లాడుతూ.. తన భార్య ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఇటీవల వినాయక చవితి అన్నదానం సందర్భంగా తనపై దాడి చేయించిందని వాపోయాడు. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు.