ప్రజా సమస్యల పరిష్కారానికై పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం 8వ వర్డ్ లో నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు శనివారం సాయంత్రం ఐదు గంటలకు పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. నరసాపురం నియోజకవర్గం, నరసాపురం పట్టణంలో ప్రజా సమస్యలపై పరిష్కారం కోసం ప్రజల వద్దకు తిరుగుతూ సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా చూడాలని మున్సిపల్ సిబ్బందిని నాయకర్ కోరారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వార్డులో డ్రైనేజీ వ్యవస్థ సానిటేషన్ ఐదు సంవత్సరాలు పాటు గాలికి వదిలేసారని విమర్శించారు.