ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచాలని ఎమ్మార్పీఎస్ జన్నారం మండల అధ్యక్షుడు కొండుకూరి ప్రభుదాస్ కోరారు. సోమవారం జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు దివ్యాంగులు, వృద్ధులు తదితరులకు పెన్షన్ పెంచాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరుబాట పట్టారన్నారు. అందులో భాగంగా అక్టోబర్ 11న చలో హైదరాబాద్ కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.