ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం సందర్శించారు. వరద నీటి ఉద్ధృతి వల్ల ముత్యాల చెరువు తెగిపోవడంతో ధర్పల్లి మండలం వాడి గ్రామంతో పాటు నడిమి తండా, బీరప్ప తండాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలకు ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీ.పీతో కలిసి వాడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలలో ఎమ్మెల్యేతో కలిసి పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు.