రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఆయన బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన సీఎం పదవిని అధిరోహించిన అనంతరం ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రియంబర్స్మెంట్ అలాగే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లిన మహానుభావుడని అ