రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మాజీ జడ్పిటిసి మధుకర్లు డిమాండ్ చేశారు మంగళవారం మర్పల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం నుండి న్యూ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు అనంతరం డిప్యూటీ తహసిల్దార్ పరుశురాం కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు