మహిళలను అన్ని విధాల అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యం. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం. చౌడేపల్లి మండలం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద శ్రీ శక్తి విజయోత్సవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చల్లా రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను అన్ని విధాల అభివృద్ధి చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు. మహిళలు ఐదు రకాల బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు.