ఈరోజు మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, నాయకులు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు