ఎమ్మిగనూరులో కబ్జాదారులపై చర్యలు తీసుకోండి: సీపీఐ ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ స్థలాలను కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు మంగళవారం కమిషనర్ గంగిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. పట్టణ కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ SMT కాలనీ, మైనార్టీ కాలనీల్లో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు మున్సిపల్ స్థలాలను కబ్జా చేశారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాలని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.