సూర్యాపేటలో ఖమ్మం ఎక్స్ రోడ్డు వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి సృహ తప్పి పడిపోయిన ఘటన జరిగింది.. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు నాగరాజు, నాగయ్య వెంటనే స్పందించారు. బాధితుడిను 108 లో ట్రాఫిక్ సిబ్బంది సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. బిపి తక్కువ కావడంతో సృహ కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.