కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ శ్రీ లక్ష్మీ హోమ్స్ లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరిందని స్థానికులు గురువారం ధర్నా నిర్వహించారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో కాలనీ ముఖద్వారం నుంచి ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చినా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కాలనీలోని స్థానిక ప్రజలకు ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాలలో కురిసే వర్షపు నీరు తమ కాలనీ వైపు వచ్చి, అక్కడే వర్షపు నీరు నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల స్పందించి నీళ్లు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.