Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 23, 2025
దేవీపట్నం మండలంలో గోదావరి వరద అత్యంత భారీగా పెరుగుతుంది. శనివారం మధ్యాహ్నం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయ సమీపంలో అత్యంత భారీగా వరద నీరు పెరిగినట్లు స్థానికులు తెలిపారు. అమ్మవారి ఆలయం పూర్తిగా గోదావరి వరద నీటిలో మునిగిపోయిందని, గోపుర చివర భాగం కూడా కనిపించడం లేదని దేవస్థాన ఈవో లక్ష్మీ కుమార్ పేర్కొన్నారు.