బొండపల్లి మండలంలోని పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సోమవారం సాయంత్రం బొండపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి ఏ వి రమణ తెలిపారు. వెదురువాడ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, కొండ కరకం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చోరీలకు పాల్పడ్డారని, నిందితులు నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఒక మోటారు, రెండు గొర్రెలు, రెండు కోళ్ళు,చోరీకి వినియోగించిన ఆటోను స్వాధీన పరుచుకుని సీజ్ చేశామన్నారు. సమావేశంలో బొండపల్లి ఎస్ ఐ యు మహేష్,ట్రైనీ ఎస్ఐ పాల్గొన్నారు.