శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా అధికారులు 16 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేసిన కూరగాయల మార్కెట్, వాణిజ్య సముదాయ భవనాలతో పాటు పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ పేర్కొన్నారు.