కాంగ్రెస్ నాయకులు పనుల జాతర పేరిట కొబ్బరి కాయలు కొడుతున్నారు, కేంద్రం ఇచ్చే నిధులకు కొబ్బరి కాయలు కొట్టడం ఏంటని, వారిపై కలెక్టర్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోనీ విఏఆర్ కన్వెన్షన్ హాల్ లో ఎంపీ రఘు నందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. మోడీ కొన్ని రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతున్నారని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజక వర్గాల్లో 26అంగన్వాడీ కేంద్రాలకి రూ 2కోట్ల 8 లక్షల కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట