యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండల పరిధిలోని హాజీపూర్ గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి పండుగ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదివారం సాయంత్రం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పాలనలో దేవాలయాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.