కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి 31 మంది లబ్ధిదారులకు రూ. 18,07,248 సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. శుక్రవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందిన వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి టీడీపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది.