తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు దివ్యాంగులకు, వితంతు మహిళలకు వెంటనే పెన్షన్ పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ ఆనంద్ మాదిగ మాట్లాడుతూ ఎన్నికల్లో దివ్యాంగులకు వితంతులకు హామీ ఇచ్చి అది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆచరణలో పెట్టడం లేదని వెంటనే దివ్యాంగులకు పెంచి ఇస్తామన్న పెన్షన్ ఇవ్వాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు