బాపట్ల జిల్లా భట్టిప్రోలు ఎస్సై శివయ్య పెదలంక గ్రామంలో వాహనాలను గురువారం తనిఖీ చేశారు.వాహనదారులు తప్పనిసరిగా పత్రాలు వెంట ఉంచుకోవాలని, ఫిట్నెస్, అధిక లోడు వంటి నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై అపరాధ రుసుములు విధించారు. ట్రాక్టర్లలోని ఇసుకపై పట్టా కప్పాలని, లైసెన్సులు లేకుండా వాహనాలు నడపరాదని తెలిపారు.